సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 13:01:00

ల‌వ‌కుశ నాగరాజు గారు లేని లోటు తీర్చలేనిది : నందమూరి బాలకృష్ణ

ల‌వ‌కుశ నాగరాజు గారు లేని లోటు తీర్చలేనిది : నందమూరి బాలకృష్ణ

సీనియర్‌ సినీ నటుడు ‘లవకుశ’ నాగరాజు  శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ  హైదరాబాద్‌ గాంధీ నగర్‌లోని తన స్వగృహంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న మృతిపై నంద‌మూరి బాల‌కృష్ణ విచారం వ్య‌క్తం చేశారు. నేను లెక్క‌లేన‌న్ని సార్లు చూసిన సినిమా ల‌వ‌కుశ‌. ఇందులో ల‌వుడిగా న‌టించిన నాగ‌రాజు గారంటే నాకెంతో ఇష్టం. ఆయ‌న హ‌ఠాత్తుగా మ‌ర‌ణించ‌డం నాకెంతో బాధ క‌లిగించింది. ఆయ‌న మృతి వ్య‌క్తిగ‌తంగా నాకు చాలా లోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్ధిస్తున్నా అని బాల‌కృష్ణ పేర్కొన్నారు. 

ఎన్టీఆర్‌, అంజలిదేవి జంటగా 1963లో సి.పుల్లయ్య, సి.ఎస్‌.రావు దర్శకత్వంలో రూపొందిన ‘లవకుశ’ చిత్రంలో లవుడి పాత్రలో నటించారు నాగరాజు. అమ్మ మీద అమితమైన ప్రేమ, తండ్రిని ఎదురించే సాహసం కలబోతగా సాగే పాత్రలో అద్వితీయ అభినయాన్ని కనబరిచి మెప్పించారు. ఈ చిత్రంతో ఎన్టీఆర్‌తో నాగరాజుకు చక్కటి అనుబంధం ఏర్పడింది. అనంతర కాలంలో ఎన్టీఆర్‌తో కలిసి ఇంద్రజీత్‌, భీష్మ, టైగర్‌రాముడు, భామవిజయం, శ్రీకృష్ణసత్యతో పాటు నలభై వరకు సినిమాలు చేశారు నాగరాజు. నారదుడిగా పలు సినిమాల్లో నటించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ భాషల్లో 340కిపైగా సినిమాలు చేశారు. నాగరాజుకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.  


logo