Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Bala Krishna | హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం, అధికారులు పలు అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ప్రధాన కూడళ్ల విస్తరణపై దృష్టి సారించారు.
Bala Krishna | హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం, అధికారులు పలు అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ప్రధాన కూడళ్ల విస్తరణపై దృష్టి సారించారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చెందిన నివాస స్థలంలో కొంత భాగాన్ని రోడ్డు విస్తరణ కోసం సేకరించే ప్రతిపాదన చర్చనీయాంశంగా మారింది. ఈ భూమిని ప్రజా ప్రయోజనాల కోసం ఇచ్చేందుకు బాలకృష్ణ సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. బాలకృష్ణ నివాసానికి నందమూరి కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు 1982లో ఈ ఇంటిని నిర్మించారు. అప్పటి నుంచి ఈ నివాసం బాలకృష్ణ జీవితంలో ముఖ్య భాగంగా నిలిచింది. ఎన్టీఆర్ అభిమానులను కలుసుకోవడంతో పాటు పలు రాజకీయ, సినీ సంబంధిత కార్యక్రమాలకు కూడా ఈ ఇల్లు వేదికగా నిలిచినట్లు చెబుతారు.
అందుకే ఈ నివాసం కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు.. నందమూరి కుటుంబానికి సంబంధించిన జ్ఞాపకాలతో ముడిపడిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. అలాంటి ఇంటి స్థలంలో కొంత భాగాన్ని రోడ్డు విస్తరణకు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే భూమి సేకరణకు సంబంధించిన తుది నిర్ణయాలు, బాలకృష్ణ నివాసాన్ని ఖాళీ చేస్తారా లేదా అనే అంశాలపై అధికారికంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది.కాగా, బంజారాహిల్స్ నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనదారులకు రోడ్డు నంబర్ 45 కీలక మార్గంగా ఉంది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జంక్షన్‌ను విస్తరించడం ద్వారా ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచాలని అధికారులు భావిస్తున్నారట.
ఈ విస్తరణలో భాగంగా బాలకృష్ణ నివాసానికి చెందిన సుమారు 862.77 చదరపు గజాల స్థలాన్ని సేకరించాల్సి ఉంటుందని సమాచారం. ఈ ప్రతిపాదనకు బాలకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వెలువడ్డాయి. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
Nepal Floods | నేపాల్‌లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన పలు ఇండ్లు, వంతెనలు
KTR | దిగులుపడొద్దమ్మా.. బాగా చదువుకో.. నిరుపేద ఆదివాసీ బిడ్డకు కేటీఆర్ భరోసా!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

