Bachan Panday | అక్షయ్ కుమార్ సినిమాపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఎఫెక్ట్..!
1990లలో జమ్మూకశ్మీర్‌లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో రూపొందించిన 'ది కశ్మీర్ ఫైల్స్' ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files) సక్సెస్ ఫుల్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) తెరకెక్కించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files). 1990లలో జమ్మూకశ్మీర్‌లో తీవ్రమైన తిరుగుబాటు, అల్లరి మూకలు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో రూపొందించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సక్సెస్ ఫుల్ టాక్‌తో ప్రదర్శించబడుతుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ టాక్‌తో ప్రదర్శించడుతూ..రాధేశ్యామ్ లాంటి భారీ ప్రాజెక్టును వెనక్కి నెట్టేసింది.
ది కశ్మీర్ ఫైల్స్ ఎఫెక్ట్, మరోవైపు అంచనాలకు తగ్గట్టు కథ లేకపోవడంతో రాధేశ్యామ్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ది కశ్మీర్ ఫైల్స్ ఇపుడు మరో సినిమాపై కూడా పంజా విసురుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన తాజా చిత్రం బచ్చన్ పాండే (Bachan Panday). గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాధేశ్యామ్లాగే ఈ సినిమాపై కూడా ది కశ్మీర్ ఫైల్స్ ఎఫెక్ట్ పడ్డది.
యావరేజ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఓపెనింగ్ డేన రూ.13+ కోట్ల వసూళ్లు చేసిన బచ్చన్ పాండే వీకెండ్ వచ్చేసరికి అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ మూవీ శని, ఆదివారాల్లో మరింత కలెక్ట్ చేయాల్సి ఉండగా, ఆ రెండు రోజుల్లో కూడా కేవలం ₹ 12 కోట్లు మాత్రమే రాబట్టింది.ఇక వచ్చే శుక్రవారం మరో క్రేజీ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ కూడా విడుదల కాబోతుంది.
Read Also : SS Rajamouli | తన సక్సెస్ ఫార్ములా ఏంటో చెప్పిన రాజమౌళి
ఈ శుక్రవారంలోపు కాస్త ఉపశమనం దొరికితే బచ్చన్ పాండే సుమారు రూ.60-70 కోట్లు రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ది కశ్మీర్ ఫైల్స్ క్రేజ్ నేపథ్యంలో పెరుగుతున్న ఒత్తిడి నుంచి బచ్చన్ పాండే కోలుకునే ఛాన్స్ తక్కువేనని అభిప్రాయపడుతున్నారు మూవీ లవర్స్.
Read Also : Kabzaa Movie | పాన్ ఇండియా ప్రాజెక్టులో తెలుగు యాక్టర్లు..క్రేజీ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

