Kabzaa Movie | పాన్ ఇండియా ప్రాజెక్టులో తెలుగు యాక్టర్లు..క్రేజీ అప్డేట్
ఆర్ చంద్రు డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం మల్టీస్టారర్ కబ్జ (Kabzaa) మరోసారి హెడ్‌లైన్స్ లో నిలిచింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఇద్దరు తెలుగు యాక్టర్లు నటిస్తున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
శాండల్ వుడ్ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ కబ్జ (Kabzaa). ఆర్ చంద్రు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరోసారి హెడ్‌లైన్స్ లో నిలిచింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో ఇద్దరు తెలుగు యాక్టర్లు నటిస్తున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు మురళీ శర్మ (Murali Sharma), పోసాని కృష్ణ మురళి ( Posani Krishna Murali) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మురళీ శర్మకు టీంలోకి స్వాగతం అంటూ ఈ విషయాన్ని డైరెక్టర్ చంద్రు ట్విటర్ ద్వారా ప్రకటించాడు.
కబ్జ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, కబీర్ దుహన్ సింగ్, బొమన్ ఇరానీ, ఎం కామరాజ్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నఈ చిత్రాన్ని శ్రీ సిద్దేశ్వర ఎంటర్ప్రైసెస్ నిర్మిస్తుంది. ఏడు భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రవి బస్రూర్ మ్యూజిక్ కంపోజిషన్‌లో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.
welcoming two exceptional actors of indian cinema industry @muralisharma & @posani welcome on board 💐#Kabzaa#Indianrealstarupendra#KicchaSudeepa#Rchandru#shriyasaran#Panindiamoviekabzaa#muralisharma#posanikrishnamurali pic.twitter.com/TzntBpgSkX
— Kabzaa Movie (@KabzaaM) March 21, 2022
కన్నడ స్టార్ హీరోలైన ఉపేంద్ర, కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులని తెలిసిందే. ఈగ సినిమాలో విలన్‌గా, సైరాలో కీ రోల్లో కనిపించి..మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించాడు సుదీప్. మరోవైపు సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు ఉపేంద్ర.
Read Also ; Anushka Sharma | ప్రొడక్షన్ హౌజ్‌ను పక్కన పెట్టిన అనుష్క..కారణమేంటో..?
Read Also ; Shabaash Mithu | ‘శభాష్ మిథు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న తాప్సీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

