బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma) టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న తర్వాత సిల్వర్ స్క్రీన్ కు దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది పండంటి కూతురు పుట్టడంతో ఇప్పటివరకు ఆమె ఆలనాపాలనా చూసుకోవడంపైనే దృష్టిపెట్టింది అనుష్క. అయితే ఈ భామ ఇప్పటికే క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ (Clean Slate Filmz) పేరుతో ఓ ప్రొడక్షన్ హౌజ్‌ను కూడా ప్రారంభించింది. తాజాగా అనుష్కకు సంబంధించిన వార్త ఒకటి బీటౌన్‌లో హల్ చల్ చేస్తోంది.
ఈ బ్యూటీ నిర్మాణ సంస్థ బాధ్యతల నుంచి పక్కు తప్పుకుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సడెన్‌గా అనుష్క ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటంటే ప్రస్తుతానికి యాక్టింగ్ పైనే ఫోకస్ పెట్టాలని అనుకుంటుందట. అందుకే సీఎస్ఎఫ్ నుంచి బయటకు వచ్చినట్టు టాక్. అయితే సీఎస్ఎఫ్ బ్యానర్ బాధ్యతలను తన సోదరడు కర్నేశ్ శర్మ (Karnesh Ssharma) చూసుకుంటాడని ప్రకటించింది. మొత్తానికి మళ్లీ మునుపటిలా కెరీర్‌ను ట్రాక్ పైకి తీసుకెళ్లడంపై ఫోకస్ పెట్టడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అనుష్క ప్రస్తుతం భారత మాజీ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ ఛక్డా ఎక్స్‌ప్రెస్ (Chakda Xpress) లో లీడ్ రోల్ పోషిస్తుంది. దీంతోపాటు పలు ప్రాజెక్టులు అనుష్క ఖాతాలో ఉన్నాయి.