మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో రాంచరణ్, అల్లు అర్జున్ ఇప్పటికే స్టార్ హీరోలుగా క్రేజ్ సంపాదించుకున్నారు. మెగా సపోర్టు అవసరం లేకుండా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే మిగిలిన హీరోల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వాళ్లు సాయిధరమ్‌తేజ్ (Sai Dharam Tej), వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఈ మెగా మేనల్లుళ్లు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పైనే ఆశలు పెట్టుకున్నారని ఇపుడు టాలీవుడ్ (Tollywood) లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
సాయిధరమ్ తేజ్‌కు కొంతకాలంగా సరైన హిట్టు పడలేదు. మధ్యలో బైకు యాక్సిడెంట్ అవడంతో ఆ తర్వాత విడుదలైన రిపబ్లిక్ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలువడంతో కమ్ బ్యాక్ ఎంట్రీలోనైనా మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. పవన్ కల్యాణ్ నటించనున్న తమిళ రీమేక్ చిత్రం వినోదయ సీతమ్ (Vinodaya Sitham) లో కీ రోల్లో కనిపించనున్నాడు సాయిధరమ్. ఈ మూవీలో పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడని ఇన్ సైడ్ టాక్. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా..త్రివిక్రమ్ డైలాగ్స్ అందించనున్నాడు.
ఉప్పెనతో మంచి సక్సెస్ అందుకొని, ఆ తర్వాత మరో హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు వైష్ణవ్ తేజ్. డైరెక్టర్ సుధీర్ వర్మ యువ హీరో వైష్ణవ్ తేజ్ కోసం ఓ కథను సిద్దం చేశాడట. ఈ ప్రాజెక్టులో పవన్ కల్యాణ్‌ను అతిథి పాత్రలో చూపించాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే పీకే నుంచి మాత్రం అఫీషియల్‌గా ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదని టాక్ ఉన్నప్పటికీ..పవన్ కల్యాణ్ మాత్రం తన మేనల్లుళ్లకు సాయం చేసే విషయంలో హ్యాపీగా ఫీలవుతాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరి రాజకీయాలు, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ షెడ్యూల్‌తో ఉన్న పవన్ కల్యాణ్ మేనల్లుళ్ల కోసం టైం కేటాయిస్తాడా..? లేదా అన్నది చూడాలి.