ప్రయోగాత్మక చిత్రాలు చేయడం కోసం ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha). ఈ చెన్నై సుందరి ఇటీవలే పుష్ప సినిమాలో హాట్ హాట్ సాంగ్‌తో అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. అయితే మళ్లీ మునుపటిలా మంచి కమర్షియల్ హిట్ కోసం చూస్తోంది సామ్. ఈ బ్యూటీ తాజాగా ఫీ మేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్టు యశోద (Yashoda)లో నటిస్తోంది. ఈ సినిమాతో తనలోని యాక్షన్ అవతార్‌ను మరోసారి బయటపెట్టబోతుంది.
లేటెస్ట్గా సమంతకు సంబంధించి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న స్టిల్ యే దీనికి నిదర్శనం. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ యానిక్ బెన్ (Yannick Ben) సారథ్యంలో యాక్షన్ కొరియోగ్రఫీలో శిక్షణ తీసుకుంటోంది సమంత. ట్రాన్స్ పోర్టర్ 3, ప్రాజెక్టు 7, పారిస్ బై నైట్ ఆఫ్ లివింగ్ డెడ్, సిటీ హంటర్, క్రిస్టోఫర్ నొలన్ తెరకెక్కించిన ఇన్ సెప్షన్, డున్కిర్క్ లాంటి హాలీవుడ్ సినిమాలకు స్టంట్స్ కొరియోగ్రఫర్‌గా పని చేశాడు యానిక్ బెన్.
#Samantha's #YashodaTheMovie Team roped in Hollywood stunt master #YannickBen for pivotal action scenes. pic.twitter.com/QLyS8wCGw7
— Manobala Vijayabalan (@ManobalaV) March 19, 2022
షారుక్ ఖాన్ నటించిన రయీస్, సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై, పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది, మహేశ్ బాబు నటించిన వన్..నేనొక్కడినే చిత్రాలకు కూడా పని చేశాడు. యానిక్ బెన్ ఇప్పటికే సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌కు స్టంట్స్ సమకూర్చాడు. తాజాగా మరోసారి యశోద కోసం పనిచేయబోతున్నాడు.