బాహుబలి (Baahubali) తర్వాత టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)కాస్తా పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ఈ సినిమా ప్రభాస్‌కు ఇంటర్నేషనల్ స్థాయిలో స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ప్రభాస్‌తో ఒక్కసారైనా నటించాలని దాదాపు ప్రతీ హీరోయిన్ అనుకుంటారంటే ఈ హీరో క్రేజ్ ఏ రేంజ్‌కు వెళ్లిందో తెలిసిపోతుంది. అయితే ప్రభాస్‌తో మరో సినిమా చేయాలనుకునే భామల్లో పొడుగు కాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) కూడా చేరిపోయింది. ఇటీవలే ప్రభాస్‌తో కలిసి రాధేశ్యామ్‌లో నటించింది పూజాహెగ్డే.
ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. అయితే బాక్సాపీస్ వద్ద ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఈ భామ ఇటీవలే ఓ బాలీవుడ్ (Bollywood)మీడియా సంస్థతో చిట్ చాట్ చేసింది. ప్రభాస్‌తో ఒకవేళ మరో సినిమా చేయాల్సి వస్తే అని అడిగిన ప్రశ్నకు పూజాహెగ్డే ఆసక్తికర కామెంట్ చేసి..అందరి చూపు తనవైపునకు తిప్పుకుంది. ఒకవేళ సరైన స్క్రిప్ట్ వస్తే..ఎందుకు సినిమా చేయను..? ప్రభాస్‌తో బాహుబలి 3 (Baahubali 3)సినిమా చేయాలనుందని (నవ్వుతూ) చెప్పింది.
ప్రభాస్ గొప్ప నటుడు..అని ఆయనతో కలిసి నటించిన సమయం చాలా విలువైందని చెప్పుకొచ్చింది. పూజాహెగ్డే ముందుకు మంచి కథ వస్తే మళ్లీ ప్రభాస్‌తో కలిసి నటించేందుకు రెడీగా ఉందని..తాజా చిట్‌చాట్‌లో చెప్పిన మాటలే చెప్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుందో..లేదో చూడాలి.