టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఇటీవలే భీమ్లానాయక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ తర్వాత చేయబోయే సినిమా షూటింగ్‌కు లైన్ క్లియర్ అయింది.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేలా ప్లాన్ రెడీ చేశాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సన్నాహకాల్లో ఉన్నాడని లేటెస్ట్ టాక్. హరిహర వీరమల్లులో బాలీవుడ్ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తాజా అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు పవన్ అభిమానులు.