Shabaash Mithu | ‘శభాష్ మిథు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న తాప్సీ
కల్పిత కథలతో పాటు నిజజీవిత కథలు కూడా ఈ మధ్య కాలంలో బాగా రూపొందుతున్నాయి. ప్రస్తుతం నిజజీవిత సినిమాలకు ప్రేక్షకులలో ఆదరణ పెరిగింది. నిజజీవిత కథలు అనగానే ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ బజ్ ఎర్పడుతుంది.
Shabaash Mithu teaser | కల్పిత కథలతో పాటు నిజజీవిత కథలు కూడా ఈ మధ్య కాలంలో బాగా రూపొందుతున్నాయి. ప్రస్తుతం నిజజీవిత సినిమాలకు ప్రేక్షకులలో ఆదరణ పెరిగింది. నిజజీవిత కథలు అనగానే ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ బజ్ ఎర్పడుతుంది. దర్శక నిర్మాతలు కూడా నిజజీవిత కథలను బేస్ చేసుకుని సినిమాలను తెరకెక్కించాలని ఆరాటపడుతున్నారు. ఈ మధ్య కాలంలో అలా క్రికెటర్ల నిజజీవిత కథలు సినిమాలుగా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గరే కాకుండా.. విమర్శకుల నుంచి కూడా గొప్ప ప్రశంసలు అందుకుంటున్నాయి. అందులో’M.S ధోని:ది అన్‌టోల్డ్ స్టోరి’,’ 83′ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి. తాజాగా మరో క్రికెటర్ కథ తెరమీదకు రావడానికి సిద్ధమైంది.
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘శభాష్ మిథు’. శ్రీజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ మిథాలీరాజ్‌గా నటించనుంది. ఇదివరకే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై మంచి అంచాలను నెలకొల్పాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఆధ్యాంతం ఆకట్టుకుంటుంది. వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ను పరిచయం చేస్తూ నాలుగు సార్లు వరల్డ్ కప్ కెప్టెన్‌గా.. అతి చిన్న వయసులోనే టెస్ట్‌లో 200 చేసిన క్రికెటర్‌గా టీజర్లో మిథాలి రికార్డులను చూపించారు . స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వయాకామ్ 18స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుంది.
ఇవి కూడా చూడండి:
K.G.F Chapter-2 | ‘కేజీఎఫ్-2’ తుఫాన్ వచ్చేసింది.. గూస్బంప్స్ తెప్పిస్తున్న లిరిక్స్
Mohan Babu | రెండు జతల బట్టలతో.. కారు షెడ్డులో ఉన్నాను :మోహన్‌బాబు
Vijay Devarakonda | ఆర్మీ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ?
Krithi Shetty | బాలీవుడ్ నుంచి కృతిశెట్టికి పిలుపు.. ఎంట్రీ ఆ స్టార్ హీరోతో ఇవ్వనుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

