K.G.F Chapter-2 | ‘కేజీఎఫ్-2’ తుఫాన్ వచ్చేసింది.. గూస్బంప్స్ తెప్పిస్తున్న లిరిక్స్
ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో 'కేజీఎఫ్-2' ఒకటి. ఎలాంటి అంచనాల్లేకుండా 2018లో వచ్చిన 'కేజీఎఫ్' బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది.
K.G.F Chapter-2 | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘కేజీఎఫ్-2’ ఒకటి. ఎలాంటి అంచనాల్లేకుండా 2018లో వచ్చిన ‘కేజీఎఫ్’ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. కన్నడ సినిమాలకు అంతగా గుర్తింపు లేని సమయంలో ‘కేజీఎఫ్’ సినిమా ఒక్క సారిగా ప్రతి ఇండస్ట్రీని కన్నడ వైపు చూసేలా చేసింది. అప్పటివరకు ఒక సినిమాలో అలాంటి ఎలివేషన్లు ఎక్కడా చూడలేదు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రంతో బెస్ట్ ఎలివేషన్ దర్శకుడిగా తన పేరును లిఖించుకున్నాడు. రాఖీ భాయ్‌గా యష్ తన నటనతో ప్రేక్షకులను మళ్ళీ మళ్ళీ థియేటర్లకు వచ్చేలా చేశాడు. యష్ అంటే కన్నడ హీరోనా అనే దగ్గర నుంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. ఈ చిత్ర సీక్వెల్ గురించి కన్నడ ప్రేక్షకులే కాదు.. సౌత్ టూ నార్త్ ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదరుచూస్తున్నారు.
‘కేజీఎఫ్-2’ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులలో రెట్టింపు అంచనాలను నమోదు చేశాయి. ఇదివరకే విడుదలైన టీజర్ ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీక్షించిన టీజర్‌గా రికార్డు సృష్టించింది. తాజాగా చిత్రం నుంచి ‘తుఫాన్’ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పాటలోని లిరిక్స్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామజోగయ్యశాస్త్రీ ఈ పాటకు సాహిత్యాన్ని అందించిగా శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, అర్జున్ కౌండిన్యతో పాటు పలువురు గాయనీగాయకులు ఈ పాటను ఆలపించారు. రవిబస్రుర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. హోంబలే బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ అత్యంత భారీగా నిర్మించాడు. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయునున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 27 సాయంత్రం 6.40కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Mohan Babu | రెండు జతల బట్టలతో.. కారు షెడ్డులో ఉన్నాను :మోహన్‌బాబు
Vijay Devarakonda | ఆర్మీ ఆఫీసర్‌గా విజయ్ దేవరకొండ?
Krithi Shetty | బాలీవుడ్ నుంచి కృతిశెట్టికి పిలుపు.. ఎంట్రీ ఆ స్టార్ హీరోతో ఇవ్వనుందా?
D.V.V Danayya | ఆ యంగ్ డైరెక్టర్‌తో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత కొడుకు.. హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

