SS Rajamouli | తన సక్సెస్ ఫార్ములా ఏంటో చెప్పిన రాజమౌళి
తాను దూరదృష్టి కలవాడిని కాదని, అత్యధిక మందికి దగ్గరయే సినిమాలు తీయడమే తాను చేయగలనని చెప్పాడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). అప్ కమింగ్ పీరియాడిక్ డ్రామా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ (RRR promotions) లో భాగంగా తన ఫిల్మ్ మేకింగ్ ఫిలాసఫీ గురించి చెప్పుకొచ్చాడు జక్కన్న.
బాహుబలి (Baahubali) సినిమాతో పాన్ ఇండియా ప్రాజెక్టులకు బాట వేశాడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). కానీ తాను దూరదృష్టి కలవాడిని కాదని, అత్యధిక మందికి దగ్గరయే సినిమాలు తీయడమే తాను చేయగలనని చెప్పాడు రాజమౌళి. తన అప్ కమింగ్ పీరియాడిక్ డ్రామా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ (RRR promotions) లో భాగంగా తన ఫిల్మ్ మేకింగ్ ఫిలాసఫీ గురించి చెప్పుకొచ్చాడు జక్కన్న. పాన్ ఇండియా సినిమాలనేవి భారతీయ సినిమాను మార్చే గేమ్ ఛేంజర్స్ అని అన్నాడు.
బలమైన భావోద్వేగాలుంటే ఎక్కువమంది ప్రజలు మన సినిమాను ఇష్టపడతారని నా కెరీర్ ప్రయాణంలో నేర్చుకున్నా. అదే నేనిపుడు చేస్తున్నానన్నాడు రాజమౌళి. బాహుబలి సినిమాను దేశమంతా ఎలా ఇష్టపడిందని చూసినపుడు, మానవ భావోద్వేగాల ఆధారంగా రాసుకున్న కథలను సినిమాలుగా తీస్తే..ఫలితం బాహుబలిలా ఉంటుందని తెలుసుకున్నట్టు చెప్పాడు. కొన్ని సినిమాలు (ఇతర పాన్ ఇండియా సినిమాలు) బాగా ఆడుతున్నాయి. వారి సినిమాలు సక్సెస్ఫుల్ అవుతున్నందుకు జక్కన్న చాలా సంతోషంగా ఉందన్నాడు.
Read Also : Kabzaa Movie | పాన్ ఇండియా ప్రాజెక్టులో తెలుగు యాక్టర్లు..క్రేజీ అప్డేట్
అయితే ఇంత పెద్ద స్థాయిలో మార్పులెలా వచ్చాయో చెప్పేందుకు తన దగ్గర ఎలాంటి ఆధారం లేదన్నాడు జక్కన్న. మొత్తానికి బాహుబలితో భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తం చేసిన జక్కన్న ఆర్ఆర్ఆర్ తో మరో హిట్టు కొట్టడం గ్యారంటీ అని ధీమాగా ఉన్నారు మూవీ లవర్స్. ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం మార్చి 25న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
Read Also : Anushka Sharma | ప్రొడక్షన్ హౌజ్‌ను పక్కన పెట్టిన అనుష్క..కారణమేంటో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

