Baby Movie | అందరూ సొంత కథగా ఫీల్ అవుతారు
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ముఖ్యతారలుగా నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకుడు. ఈ నెల 14న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్కేఎన్ తన పుట్టినరోజు సందర్భంగా బేబీ విశేషాలను పంచుకున్నారు.
Baby Movie | ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ముఖ్యతారలుగా నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకుడు. ఈ నెల 14న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్కేఎన్ తన పుట్టినరోజు సందర్భంగా బేబీ విశేషాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ “బేబీ’ మూవీ విడుదలకు ముందు జరుగుతున్న ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాను. ఇదొక హై ఇంటెన్స్ ఎమోషనల్ ప్రేమకథ. సంగీతం కూడా చాలా బాగుంటుంది.
ఈ మధ్య కాలంలో ఈ స్థాయి చిత్రాలలో బెస్ట్‌మ్యూజిక్ అని చెప్పొచ్చు. సీన్స్, డైలాగ్స్ కొత్తగా వుంటాయి. ఇంతవరకు చూడని కొత్త సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి. హీరో ఆనంద్ కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయిగా మిగిలిపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇది నా కథ అని ఫీల్ అవుతూ బరువెక్కిన హృదయంతో థియేటర్ నుండి వెళతారు. త్వరలోనే నా నిర్మాణంలో మరికొన్ని సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేస్తాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

