Baahubali producer | సోషల్ మీడియా ఖాతాల హ్యాకింగ్ కొత్తదేమి కాదు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు హ్యాకర్స్ బారిన పడుతుండటం చూస్తూనే ఉంటాం. తాజాగా బాహుబలి ప్రాంఛైజీ నిర్మాత (Baahubali Producer) శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) కూడా ఈ బాధితుల జాబితాలో చేరిపోయారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా షేర్ చేశారు.
నా వాట్సాప్ ఖాతా హ్యాక్ చేయబడింది. నా ఖాతా హ్యాకర్ కంట్రోల్లో ఉంది. అంతకంటే భయంకరమైన విషయం ఏమిటంటే
@WhatsApp నేను మరో 12 గంటల పాటు తిరిగి లాగిన్ అవ్వడానికి అనుమతి లేదు. దీనిక్కారణం ఎందుకంటే నేను చాలాసార్లు తప్పు పిన్ని ఎంటర్ చేశాను. ఈ సమయంలో హ్యాకర్ నా కాంటాక్ట్‌లో ఉన్న చాలా మంది వ్యక్తులను మోసం చేశారు. నా వాట్సాప్‌ను చేరుకునే చాన్స్ లేదు. దయచేసి నా వాట్సాప్ సమస్య గురించి ఏదైనా చేయండి అంటూ @Meta @WhatsAppకు ట్యాగ్ చేశారు. దీనిపై వాట్సాప్ ఎలా స్పందిస్తుందేమో చూడాలి.
టాలీవుడ్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన సినిమాల్లో టాప్‌లో ఉంటుంది బాహుబలి. ఆర్కా మీడియా వర్క్స్‌పై శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సృష్టించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడ్యూసర్‌గా మారిన శోభు యార్లగడ్డ ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారు.
My @WhatsApp account has been hacked. Hacker has control of my account . Whats More terrible is that @WhatsApp doesn’t let me log back in for 12 hours because it says I entered wrong pin multiple times. In the mean time the hacker has been duping more people on my contact and…
— Shobu Yarlagadda (@Shobu_) December 5, 2024
Rashmika Mandanna | రష్మిక మందన్నా ఏంటీ సంగతి..? విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఏఎంబీ మాల్లో..
Fahadh Faasil | ఎక్జయిటింగ్ అనిపించిందే చేశానంటున్న పుష్ప యాక్టర్ ఫహద్ ఫాసిల్