Baa Baa Black Sheep | తెలుగులో క్రైం కామెడీ జోనర్లో వచ్చే సినిమాలకు మంచి రెస్పాన్స్ ఉంటుందని తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే లైన్లో వస్తోంది బా బా బ్లాక్‌షీప్ (Baa Baa Black Sheep). న్యూ ఏజ్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రాన్ని గుణి మంచికంటి డైరెక్ట్ చేస్తున్నాడు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ, విస్మయ శ్రీ, మాళవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
దసరా సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లాంచ్ చేశాడు. ఆరుగురు వ్యక్తులు.. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట, ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనల నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు వీడియో ద్వారా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. ఆరుగురు వ్యక్తుల ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులు, ఈ క్రమంలో వచ్చే కామెడీ, క్రైం లాంటి అంశాలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించనున్నట్టు తాజా వీడియో చెప్పకనే చెబుతోంది.
దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోణెపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
A tale of twists, turns, and total madness 🐑💥#BaaBaaBlackSheep – not your nursery rhyme.
Shoot begins soon… buckle up for the craziest, unstoppable ride! 🤘🏻@ChitralayamOffl @VenuDonepudi @ManchikantiGuni @swethadonepudi #KondalJinna… pic.twitter.com/9BWy1FmHwh
— Chitralayam Studios (@ChitralayamOffl) October 1, 2025
The craziest ride is all set to roll! 😎
Blockbuster Director #TharunBhascker garu unveils the Title & Motion Poster of #BaaBaaBlackSheep 💥
▶️ https://t.co/bB9O3avXpL@ChitralayamOffl @VenuDonepudi @ManchikantiGuni @swethadonepudi #KondalJinna #SatishMeka @AjayAbrahamGeo1… pic.twitter.com/xT1AQyj6Pt
— Chitralayam Studios (@ChitralayamOffl) October 1, 2025
Nayanthara | ‘మన శంకర వరప్రసాద్‌గారు’ నుంచి శశిరేఖ పరిచయం
Akkineni Nagarjuna | AI దుర్వినియోగంపై నాగార్జున పోరాటం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు