సాయిరోనక్, అవికాగోర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పాప్‌కార్న్’. నాగ శ్రీనివాస్ గంధం దర్శకుడు. ఆచార్య క్రియేషన్స్ పతాకంపై భోగేంద్రగుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవికాగోర్ జన్మదినం సందర్భంగా బుధవారం ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఒకరినొకరు ద్వేషించుకునే ఓ జంట కథ ఇది. తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితుల్లో చిక్కుకున్న వారిలో ఎలా పరివర్తన వచ్చింది? ద్వేషం స్థానంలో ఆ జంట మధ్య ఏ విధంగా ప్రేమ జనించిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. కథ నచ్చడంతో ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూనే సహనిర్మాతగా అవికాగోర్ వ్యవహరిస్తోంది. యువతరాన్ని మెప్పించే చక్కటి ప్రేమకథా చిత్రంగా నిలుస్తుంది’ అని అన్నారు. మోషన్ పోస్టర్‌కు చక్కటి స్పందన లభిస్తోందని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్.