Atlee 6 | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan). ఇప్పటికే స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌తో సికిందర్ సినిమా చేస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు బీటౌన్ యాక్టర్ వరుణ్ ధవన్ నటిస్తోన్న బేబిజాన్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతోపాటు సాజిద్ నడియాద్వాలాతో కలిసి కిక్ 2 కూడా చేస్తున్నాడు.
ఇప్పుడిక క్రేజీ ప్రాజెక్ట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) డైరెక్షన్లో చేయబోతున్న సినిమా వార్త వచ్చేసింది. కమల్ హాసన్, సల్లూభాయ్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం Atlee 6గా తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే దానిపై ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా టాక్ ప్రకారం 2025 తొలి త్రైమాసికంలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది.
అంతేకాదు ఇందులో కమల్ హాసన్, సల్లూభాయ్ పాత్రలు సమాన స్థాయిలో ఉండబోతున్నాయట. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. పాపులర్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని ఫిలిం నగర్ సర్కిల్ టాక్. సల్మాన్ ఖాన్ నేడు బేబిజాన్ షూట్లో పాల్గొన్నట్టు సమాచారం.
Read Also :
Siddu Jonnalagadda | జాక్ షూట్ గురించి చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ
They Call Him OG | ఓజీ అప్డేట్స్ త్వరలో.. పవన్ కల్యాణ్ అభిమానులను ఎస్ థమన్ గుడ్‌న్యూస్
Khel Khel Mein | ఓటీటీలోకి అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Srinu Vaitla | ట్రెండ్‌కు తగినట్టుగా తీశా.. ఆ పాత్రను రీప్లేస్ చేయడం చాలా కష్టం: శ్రీనువైట్ల