అథర్వ మురళి, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘టన్నెల్’. తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇవాళ తెలుగులో విడుదలైంది. లచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.రాజు నాయక్ ఈ సినిమాను విడుదల చేశారు. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం..
బ్యాంక్ దొంగతనంలో కేసులో ఒక గ్యాంగ్‌ను ఎన్కౌంటర్ చేస్తారు. ఆ తర్వాత నుంచి ఎన్కౌంటర్లో పాల్గొన్న ఆఫీసర్స్ అందర్నీ ఓ గ్యాంగ్ (అశ్వత్ కాకమాను అండ్ కో) చంపేస్తుంది. వారిని మాత్రమే కాకుండా పోలీస్ యూనిఫామ్ వేసుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని ఆ గ్యాంగ్ శపథం చేస్తుంది. మరోవైపు గాలి తిరుగుడు తిరుగుతూ ఇంటిని పట్టించుకోకుండా ఉండే యువకుడు (అథర్వ) అను (లావణ్య త్రిపాఠి)తో ప్రేమలో పడతాడు. యూపీఎస్సీ పాసైన అనుకి గాలికి తిరిగే వ్యక్తికి పెళ్లచేయడానికి అను ఫాదర్ అడ్డుపడతారు. దీంతో అథర్వ జాబ్ కోసం ట్రై చేస్తాడు. ఈ క్రమంలోనే అథర్వ, అతని ఫ్రెండ్స్ అందరూ ఒకే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుళ్లుగా రిక్రూట్ అవుతారు.
జాబ్‌లో జాయిన్ అయిన అథర్వ, అతని ఫ్రెండ్స్‌కి మొదటి రోజే పెద్ద టాస్క్ ఇస్తారు. ఈ క్రమంలో స్లమ్ ఏరియాలో ఇరుక్కుపోయిన హీరో అండ్ గ్యాంగ్ ఎలా బయటపడతారు? అసలు విలన్ వేసిన వల ఏంటి? పోలీసు యూనిఫామ్ అంటే విలన్‌కు ఎందుకంత పగ? చివరకు టన్నెల్ ద్వారా విలన్ అండ్ గ్యాంగ్ ఏం చేసిందనేదే అసలు కథ.
ఆరంభం నుంచే సినిమా క్యూరియాసిటీని పెంచుతుంది. బ్యాంక్ దొంగతనం చేసిన గ్యాంగ్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం, ఆ ఎన్కౌంటర్ చేసిన పోలీసులు మరో గ్యాంగ్ హతమార్చడం, ఆ తర్వాత ఆకతాయిగా తిరిగే ఆరుగురు కుర్రాళ్లు కానిస్టేబుళ్లుగా జాబ్‌లో చేరడం.. ఇలా సినిమా అంతా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఇంటర్వెల్లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. స్లమ్ ఏరియా సెటప్ అంతా కూడా అదిరిపోయింది. అదొక పద్మవ్యూహంలా అనిపిస్తుంది. అందులో చిక్కుకున్న పోలీసులు ఎలా బయటకు వస్తారు? అనే ఆసక్తికరమైన పాయింట్లతో కథ ముందుకెళ్తుంది.
సెకండాఫ్ అంత గ్రిప్పింగ్ ఉండదు. కథ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. పైగా ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా కృతకంగానే కనిపిస్తాయి. ఎమోషనల్ పార్ట్ చాలా వీక్‌గా అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ మరింత ఎమోషన్‌గా రాయాల్సింది. ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో మాత్రం ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోతారు. చివరి 20 నిమిషాల్లో యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ఊహించినట్లుగానే నడస్తుంది.
సాంకేతికతంగా చూసుకుంటే ఈ మూవీ ఎక్కువ శాతం నైట్ టైంలోనే షూటింగ్ చేశారు. ఒక్క రాత్రిలో జరిగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం ఇచ్చిన విజువల్స్, ఆర్ఆర్ అదిరిపోయాయి. సీన్లకు తగ్గట్టుగా ఆర్ఆర్ హంట్ చేస్తుంది. ఇక ఎడిటింగ్, స్లమ్ ఏరియా సెట్ వర్క్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఇలా అన్నీ కూడా బాగానే ఉంటాయి.
ఈ సినిమాలో మెయిన్ రోల్ అథర్వ మురళి. ఎప్పటిలాగే తన యాక్షన్, రొమాన్స్‌తోపాటు ఎమోషనల్ సీన్లలో మెప్పించారు. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్‌గా అశ్వత్ కాకమాను కనిపించారు. విలన్‌గా తన పాత్రకు న్యాయం చేశాడు. అదే సమయంలో తనలోని మరో కోణాన్ని కూడా చూపించాడు. ఇక లావణ్య త్రిపాఠికి కమర్షియల్ హీరోయిన్ పాత్రే దక్కింది. హీరో గ్యాంగ్, ఇతర పోలీస్ ఆఫీసర్ల పాత్రల్లో నటించిన వారు తమ పరిధి మేరకు నటించారు.
చివరగా.. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ఆడియన్స్‌కు నచ్చే చిత్రం ‘టన్నెల్’
రేటింగ్ : 3