పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అత్తారింటికి దారేది (Atharintiki Daaredi). 2013 సెప్టెంబరు 27న విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అప్పటివరకు మగధీర పేరుమీద ఉన్న ఇండస్ట్రీ రికార్డును పవన్ కళ్యాణ్ బద్దలు కొట్టాడు. అత్తారింటికి దారేది విజయం సాధించడం అనేది అప్పట్లో ఒక సంచలనం. ఎందుకంటే విడుదలకు ముందే ఈ సినిమా సగానికిపైగా సోషల్ మీడియాలో లీక్ అయింది.
ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ 50 నిమిషాలకు పైగా ఆన్ లైన్ లో రిలీజ్ కు ముందే వచ్చేసింది. అయినా కూడా విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ తన సత్తా చూపించాడు. విడుదలకు ముందే లీక్ అయి.. రిలీజ్ తర్వాత ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన ఒకే ఒక్క సినిమా ఇదే కావచ్చు. ఆ రోజుల్లోనే అత్తారింటికి దారేది 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో చూపించింది అత్తారింటికి దారేది. సమంత అక్కినేని, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అత్త పాత్రలో నదియా నటించింది. 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న అత్తారింటికి దారేది ఏరియా వైజ్ ఫుల్ కలెక్షన్స్ చూద్దాం..
ప్రాంతాల వారీగా కలెక్షన్లు:
నైజాం: 23.30 కోట్లు
సీడెడ్: 10.46 కోట్లు
ఉత్తరాంధ్ర: 6.20కోట్లు
ఈస్ట్: 4.07 కోట్లు
వెస్ట్: 3.36 కోట్లు
గుంటూరు: 5.25 కోట్లు
కృష్ణా: 3.70 కోట్లు
నెల్లూరు: 2.60 కోట్లు
ఏపీ + తెలంగాణ: 58.80 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.50 కోట్లు
ఓవర్సీస్: 7.70 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: 75.25 కోట్లు షేర్
అత్తారింటికి దారేది సినిమా ఆ రోజుల్లోనే 51 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పవన్ కళ్యాణ్ రేంజ్ కు అది అప్పట్లో సరిపోయిన బిజినెస్సే. ఎందుకంటే గబ్బర్ సింగ్ సినిమా 67 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దాంతో అత్తారింటికి దారేది సినిమా బిజినెస్ కూడా అలాగే జరిగింది. దానికి తోడు విడుదలకు ముందే సినిమా లీక్ అయిందనే సింపతీ కూడా దీనికి బాగా వర్కవుట్ అయింది. దాంతో 75 కోట్లు షేర్ వసూలు చేసి.. బయ్యర్లకు 25 కోట్ల లాభాలు తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకుంది.
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?