Kishor Das | భారతీయ చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదకర ఘటనలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ నటి మీనా భర్త చెన్నైలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా యువ నటుడు ప్రాణాలను కోల్పోయాడు. అస్సామీ నటుడు కిశోర్ దాస్ (30) క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశాడు. క్యాన్సర్‌తో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకున్నది. సమాచారం ప్రకారం.. గత ఏడాదికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ ఏడాది మార్చి నుంచి క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించడంతో ప్రాణాలను కోల్పోయాడు. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే కొవిడ్-19 సమస్యలతో బాధపడుతున్నాడు.
అయితే, కొన్ని వారాల కిందట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాల వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. కిశోర్ దాస్ 30 ఏళ్ల వయసులోనే చాలా మ్యూజిక్ వీడియోల్లో కనిపించాడు. అసోంలోని కమ్రూప్ ఆయన స్వస్థలం. అయితే, కరోనా ప్రొటోకాల్స్ నేపథ్యంలో అంత్యక్రియలను శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. అస్సామీ ఇండ్రస్టీలో ఎక్కువగా పని చేసిన కిశోర్ దాస్.. బిధాత, బంధున్, నెదేఖా ఫగన్ తదితర అస్సామీ టెలివిజన్ షోలతో మంచి గుర్తింపును పొందాడు. అలాగే కిశోర్ దాస్ అస్సామీలో 300కి పైగా మ్యూజిక్ వీడియోల్లో నటించాడు. ‘తురుట్ తురుట్’ పాట.. అస్సామీ ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగాడు. దాస్ చివరిసారిగా ‘దాదా తుమీ డస్తో బోర్’ అనే అస్సామీ చిత్రంలో కనిపించాడు.