Pushpa 2 The Rule | అల్లు అర్జున్ (Allu Arjun)-సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం రికార్డ్ వసూళ్లతో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. కేవలం 7 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి ఎంటరై బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తున్నాడు పుష్పరాజ్. ఇప్పటికే సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ పుష్ప 2పై రివ్యూ ఇచ్చాడు.
ఉరుములాంటి మరిచిపోలేని పర్ఫార్మెన్స్.. అల్లుఅర్జున్.. స్క్రీన్‌పై నా దృష్టిని మీ నుండి పక్కకు తిప్పుకోలేకపోయాను. దేశవ్యాప్తంగా ప్రతీఒక్కరూ సినిమాను వేడుకగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రష్మిక మీరు అసాధారణంగా కనిపించారు. సూపర్ సక్సెస్ అందుకున్న సుకుమార్, డీఎస్పీ, పుష్ప ది రూల్ టీమ్‌కు శుభాకాంక్షలు.. అస్సలు తగ్గే లే.. అంటూ ట్వీట్ చేశాడు వెంకటేశ్. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
పుష్ప 2 ది రూల్ ఓపెనింగ్ డేనే నైజాం ఏరియాలో ఆర్ఆర్ఆర్ (RRR)మార్జిన్‌ను అధిగమించేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన విషయం తెలిసిందే. మరోవైపు షారుక్ ఖాన్ జవాన్ ఫస్ట్ డే రికార్డును కూడా అధిగమించేసింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ సీక్వెల్లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
A thunderous and unforgettable performance @alluarjun!! Couldn’t take my eyes off you on the screen ❤️❤️ So happy to see everyone celebrating the movie across the country! @iamRashmika you were phenomenal. Congratulations to #Sukumar @ThisIsDSP and the entire team of… pic.twitter.com/VcMxG5oLBA
— Venkatesh Daggubati (@VenkyMama) December 11, 2024
Manchu Manoj | నా తల్లి ఆస్పత్రిలో లేదు.. మాట్లాడుకోవడానికి సిద్ధం : మంచు మనోజ్
Vishwak Sen | జాతి రత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్సేన్ సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్ లుక్..!