Shivam Bhaje | హిడింబ సినిమాతో మంచి హిట్టందుకున్నా టాలీవుడ్ నటుడు అశ్విన్ బాబు (Ashwin Babu). ఈ టాలెంటెడ్ యాక్టర్ లీడ్ రోల్లో నటిస్తోన్న తాజా చిత్రం శివం భజే (Shivam Bhaje). అప్సర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్ కీ రోల్ పోషిస్తున్నాడు. దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తున్నది. తాజాగా ఈ మూవీ నుంచి సరికొత్త లుక్ రిలీజ్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.
భయానకంగా ఉన్న కన్ను లుక్ కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో ఇండియా మ్యాప్‌ను చూడొచ్చు. ఈ చిత్రం విడుదల తేదీని ఇవాళ సాయంత్రం 5:05 గంటలకు ప్రకటించనున్నట్టు తెలియజేశారు. న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా కామెడీ, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో సాగే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టేనని ఇన్ సైడ్ టాక్. ఈ మూవీలో హైపర్ ఆది, సాయిధీన, తులసి, దేవిప్రసాద్, అయ్యప్ప శర్మ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దాశరథి శివేంద్ర కెమెరామెన్ కాగా.. వికాస్ బడిస సంగీతం అందిస్తున్నారు.
లయకారుడి ఆట మొదలైంది!
కార్యసాధకుడి గమ్యం చేరువైంది!#ShivamBhaje 🔱 Release Date Announcement today, 5:05 PM@imashwinbabu @DiganganaS @apsardirector @MaheswaraMooli @vikasbadisa @Dsivendra @ChotaKPrasad @sahisuresh #AnithMadadi @GangaEnts pic.twitter.com/qK8vHRM5Tx— Ganga Entertainments (@GangaEnts) July 12, 2024
Suriya | సర్ఫిరా మనందరికీ ముఖ్యమైన సినిమా.. ట్రెండింగ్‌లో సూర్య టీం స్టిల్
Bharateeyudu 2 Review | కమల్ హాసన్ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..? శంకర్ భారతీయుడు 2 ఎలా ఉందంటే..!
Maharaja | ఓటీటీలోకి విజయ్ సేతుపతి మహారాజ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?