అశ్విన్ బాబు హీరోగా అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘శివం భజే’. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్నది. గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 1న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.
వైవిధ్యమైన కథతో, ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథ ఇదని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: వికాస్ బడిస, ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్, దర్శకత్వం: అప్సర్.