అశోక్ గల్లా అనగానే పరిచయం మొదలయ్యేది సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మరో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అనే. ఆయన ఇప్పటి వరకు ఒకే ఒక్క సినిమా చేశారు. ఇప్పుడు రెండో సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 15 నుండి నవంబర్ 22కు వాయిదా పడిన విషయం తెలిసిందే. నవంబర్ 14న పెద్ద సినిమాలు కొన్ని విడుదల కాబోతోన్న నేపథ్యంలో.. ఆ సినిమాల మధ్యలో ఎందుకని ఒక వారం వాయిదా వేశారు. ఈ గ్యాప్‌లో ప్రమోషన్స్ జోరు పెంచి.. సినిమాను ప్రేక్షకులకు మరింత దగ్గర చేర్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే హీరో అశోక్ గల్లా కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ హైట్‌పై అశోక్ గల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘గౌతమ్‌తో నేను ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయలేదు. చాలా తక్కువ టైమ్ మాత్రమే మేం కలిశాం. నేను అమెరికా, సింగపూర్లలో చదివే టైమ్‌లో ఇండియాకు చాలా తక్కువ సార్లు వచ్చేవాడిని. హాలీడేస్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో ఎక్కువగా ఉండేవాడిని. గౌతమ్‌కు, నాకు ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ. ఎప్పుడైనా మహేష్ మామ ఇంటికి వెళ్లినప్పుడు మాత్రమే గౌతమ్‌ని కలిసేవాడిని. కానీ ఇప్పుడు గౌతమ్‌ని చూస్తే నాకే ఆశ్చర్యమేస్తుంది. ఏంటి ఇంత పెరిగాడు ఈ కుర్రాడు అని.
అతను మహేష్ మామ హైట్‌ని కూడా బీట్ చేస్తాడు. ఇప్పటికే మహేష్ మామ హైట్ ఉన్నాడు. నేను ‘హీరో’ అనే సినిమా చేసేటప్పుడు కరోనా ఉండటంతో.. పెద్దగా కలవలేదు. నా ఊహల్లో అతను చిన్నగానే ఉంటాడని అనుకుంటూ ఉండేవాడిని. కానీ సడెన్‌గా చూస్తే.. తలెత్తి చూడాల్సిన విధంగా మారిపోయాడు. నేనేంటి.. వీడిని ఇలా తలెత్తి చూడాలా. వీడితో మాట్లాడాలంటే తలెత్తి మాట్లాడాలా? అని సరదాగా నవ్వుకునే వాడిని. సడెన్‌గా ఎదిగిపోయి.. ఇప్పుడు కాలేజ్‌కి వెళుతున్నాడు. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను. మనం మనలా ఉన్నా.. బయట పరిస్థితులు వాటంతట అవి జరుగుపోతూనే ఉంటాయని నాకు అప్పుడు అర్థమైంది’’ అని గౌతమ్ హైట్ గురించి అశోక్ గల్లా చెప్పుకొచ్చారు.
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె పద్మావతి, గల్లా జయదేవ్ దంపతులు కుమారుడు అశోక్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ‘హీరో’ చిత్రంతో ఆయన హీరోగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. ఆ సినిమా వచ్చిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను శిష్యుడైన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.
Read Also
Dil Raju | సుకుమార్ కోసం ఆ సినిమా ఆపేశాను: నిర్మాత ‘దిల్’ రాజు
Kamal Hassan | అద్దంలో నా ముఖం చూసుకున్నప్పుడల్లా నిజం తెలుస్తుంది: కమల్‌హాసన్
Puri jagannadh | ప్రభాస్-పూరీ జగన్నాథ్ కాంబో రిపీట్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?