బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) నెమ్మదిగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నాడు. గతేడాది రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో జైలు పాలైన ఆర్యన్ ఆ తర్వాత బెయిల్‌పై విడుదలై..ఆ కేసు ప్రభావం నుంచి మెల్లమెల్లగా బయటపడినట్టు తాజా ఫొటోలు చెబుతున్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై మెరువకున్నా..ఈ స్టార్ కిడ్ కు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రస్తుతం 2 మిలియన్ల ఫాలోవర్లున్నారు.
తాజాగా ఆర్యన్ యాడ్ ఫొటోషూట్ (Aryan Khan)తో అదిరిపోయే స్టిల్స్ ను నెట్టింట షేర్ చేశాడు. పింక్ అండ్ బ్లాక్ బాంబర్ జాకెట్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో ఉన్న స్టిల్ పోస్ట్ చేశాడు. దీంతోపాటు గ్రే టీ షర్ట్-యెల్లో జాకెట్ వేసుకున్న మరో ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఆర్యన్ ఖాన్ ఫొటోషూట్ స్టిల్స్ ను లైక్స్, కామెంట్ల వర్షం కురిసింది. అయితే కామెంట్ సెక్షన్ లో ప్రముఖ వ్యక్తి పెట్టిన క్యాప్షన్ ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది ఊహించారా..? ఇంకెవరో కాదు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. మై బాయ్ లవ్..అని గౌరీ ఖాన్ కామెంట్ పెట్టింది. ఆ తర్వాత షారుక్ స్పందిస్తూ..చాలా బాగా కనిపిస్తున్నాడు. వాళ్లు (నెట్టిజన్లు) చెప్పినట్టు తండ్రిలో ఉన్న నిశబ్దం..కొడుకులో మాట్లాడుతుంది. ఆ గ్రే టీ షర్ట్ నాదే..అంటూ కామెంట్లో పెట్టాడు. దీనికి ఆర్యన్ స్పందిస్తూ..’మీ జీన్స్-టీషర్టే’ అంటూ రిప్లై ఇచ్చాడు.
ఆర్యన్ ఖాన్ సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. షారుక్ కూడా సినిమాల్లో తన కొడుకుకు కావాల్సిన స్కిల్స్‌పై శిక్షణ కూడా ఇప్పించినట్టు ఫొటోషూట్ లో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు ఆర్యన్.
Read Also : Gautham Menon | ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’లో శింబు కనిపించడు.. ముత్తు మాత్రమే కనిపిస్తాడు : గౌతమ్ మీనన్ ఇంటర్వ్యూ
Read Also : Taapsee vs Reporter | ‘నా ప్రశ్నకు జవాబిస్తే..మీకు సమాధానమిస్తా..’రిపోర్టర్ వర్సెస్ తాప్సీ..వీడియో వైరల్
Read Also : Nagarjuna Akkineni | నలుగురు దర్శకులకు 100వ సినిమా బాధ్యతలు..ఇంతకీ వాళ్లెవరో..?