Arya Next Movie | చాలా కాలం తర్వాత ‘సార్పట్ట పరంపర’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు తమిళ హీరో ఆర్య. గతేడాది నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే అదే జోష్‌ను తన తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు. ఇటీవలే ఈయన నటించిన ‘కెప్టెన్’ విడుదలై ఫ్లాప్‌గా మిగిలింది. యాక్షన్ అడ్వేంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి హైప్‌తో సెప్టెంబర్ 8న విడులైంది. రిలీజ్ అయిన వారంలోపే థియేటర్లలో నుండి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ-5’లో అందుబాటులో ఉంది. ఇదిలా ఉంటే ఆర్య ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ చిత్రం సెట్స్ పైన ఉండగానే ఆర్య మరో సినిమాను పట్టాలెక్కించాడు. ఇటీవలే ‘విరుమన్’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన ముత్తయ్య దర్శకత్వంలో ఆర్య తన నెక్స్ట్ చిత్రాన్ని చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడీయోస్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం రూరల్ ఎమోషనల్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుందట. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఆర్యకు జోడీగా సిద్ధి ఇద్నాని హీరోయిన్గా నటించనుంది.
Read Also:
Suriya 42 | సూర్య సినిమాకు ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్.. వామ్మో అన్ని కోట్లా?
Salaar | ప్రభాస్ అభిమానులకు క్రేజీ న్యూస్.. ‘సలార్’ టీజర్ వచ్చేది అప్పుడేనట?
Vijay DevaraKonda | యూత్ ఐకాన్‌గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ..!
‘300’ కోట్ల క్లబ్లో ‘పొన్నియన్ సెల్వన్-1’.. ఆ ఘనత సాధించిన 5వ సినిమా సరికొత్త రికార్డు..!