‘300’ కోట్ల క్లబ్లో ‘పొన్నియన్ సెల్వన్-1’.. ఆ ఘనత సాధించిన 5వ సినిమా సరికొత్త రికార్డు..!
Ponniyin Selavn-1 Enter’s 300 Crore Club | ప్రస్తుతం ఏ స్టేట్‌లో చూసిన 'పొన్నియన్ సెల్వన్' పేరే వినబడుతుంది. సినిమా విడుదలై వారం రోజులు దాటినా.. ఇంకా క్రేజ్ తగ్గడం లేదు. రోజు రోజుకు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆధరణ పెరుగుతూనే ఉంది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ ౩౦న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
Ponniyin Selavn-1 Enter’s 300 Crore Club | ప్రస్తుతం ఏ స్టేట్‌లో చూసిన ‘పొన్నియన్ సెల్వన్’ పేరే వినబడుతుంది. సినిమా విడుదలై వారం రోజులు దాటినా.. ఇంకా క్రేజ్ తగ్గడం లేదు. రోజు రోజుకు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆధరణ పెరుగుతూనే ఉంది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ ౩౦న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపిస్తుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం లాభాలను రాబడుతుంది. కేవలం తమిళంలోనే కాకుండా విడుదలైన ప్రతీ భాషలోనూ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ కలెక్షన్లను సాధిస్తుంది. కాగా ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సాధించింది.
తాజాగా ఈ చిత్రం 300కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. కేవలం 8రోజుల్లోనే ఈ ఘనతను సాధించిందంటే విశేషం అనే చెప్పాలి. అంతేకాకుండా 300కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన 5వ సినిమాగా రికార్డు సృష్టించింది. ‘రోబో’, ‘కబాలి’, ‘రోబో 2.0’, ‘విక్రమ్’ సినిమాలు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.322 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఇదే స్పీడ్‌లో దూసుకపోతే ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్లో నిలవడం ఖాయం అంటూ తమిళ సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తమిళ సినీ చరిత్రలోనే నయా రికార్డులను సృష్టిస్తుంది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌రాజు రిలీజ్ చేశాడు.
Read Also:
Salaar | ప్రభాస్ అభిమానులకు క్రేజీ న్యూస్.. ‘సలార్’ టీజర్ వచ్చేది అప్పుడేనట?
Prabhas | రీ-రీలీజ్‌కు రెడీ అవుతున్న ప్రభాస్ ఫ్లాప్ మూవీ?
Suriya 42 | సూర్య సినిమాకు ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్.. వామ్మో అన్ని కోట్లా?
Karthikeya-2 | ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తున్న ‘కార్తికేయ-2’.. ‘జీ-5’లో నిఖిల్ సరికొత్త రికార్డు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

