Hit 3 | గతేడాది సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాని (Nani). ఈ స్టార్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి హిట్ ప్రాంఛైజీ హిట్ 3 (HIT: The 3rd Case). ఇప్పటికే శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్, హిట్-2 చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక హిట్ 3 కోసం అర్జున్ సర్కార్ డ్యూటీలో చేరిపోయాడు.. అంటూ మేకర్స్ నాని పాత్రపై స్నీక్ పీక్ అందిస్తూ గ్లింప్స్ విడుదల చేశారని తెలిసిందే.
మంచు పర్వతాల మధ్య కారుతో దూసుకుపోతున్న హిట్ ఆఫీసర్ని ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ఛేజ్ చేస్తున్న సన్నివేశాలు హైప్ పెంచేస్తున్నాయి.
భారతదేశం, భారతీయుల అమర స్ఫూర్తికి వందనం. హిట్ టీం తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. HIT 3 2025 మే 1న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలోకి వస్తోందని తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు. నాని గన్ పట్టుకొని సెల్యూట్ చేస్తున్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమా, నాని హోం బ్యానర్ యునానిమస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంతి త్రిపురనేని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని సిగార్ తాగుతూ, రక్తపు చేతులతో కారు నడుపుతూ, మరోవైపు గొడ్డలితో స్టైలిష్‌గా కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు నాని. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Saluting the undying spirit of India & Indians. Happy Republic Day 🇮🇳
-Team #HIT3 #HIT : The Third Case in cinemas worldwide on 1st MAY, 2025.#Nani32
Natural Star @NameisNani @KolanuSailesh @SrinidhiShetty7 @komaleeprasad @MickeyJMeyer @SJVarughese @karthikaSriniva… pic.twitter.com/pWiFpfg2Gh— Wall Poster Cinema (@walpostercinema) January 26, 2025
VD14 | రిపబ్లిక్ డే స్పెషల్.. కీ అప్డేట్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ టీం
Shafi | పది రోజులుగా వెంటిలేటర్‌పై.. ప్రముఖ దర్శకుడు షఫీ మృతి
SSMB29 Update | సింహన్ని లాక్ చేసిన రాజమౌళి.. SSMB29 ప్రాజెక్ట్ షూరు.!