Arjun S/O Vyjayanthi | టాలీవుడ్ యాక్టర్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తుండగా.. ఈ సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి స్పందన రాబట్టుకుంటోంది.
ట్రైలర్ నెట్టింట నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. తాజా అప్డేట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచేస్తోంది. కర్తవ్యం సినిమాలో వైజయంతిగా సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసిన విజయశాంతి మరోసారి ఈ చిత్రంలో మెరువబోతున్నట్టు విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. తల్లీకొడుకులుగా కళ్యాణ్ రామ్, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువబోతున్నాయని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి.
ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సోహైల్ ఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, పృథ్విరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కిస్తోంది. బీ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
A mother’s DUTY and a son’s FURY 🔥
‘𝐀𝐑𝐉𝐔𝐍 𝐒𝐎𝐍 𝐎𝐅 𝐕𝐘𝐉𝐀𝐘𝐀𝐍𝐓𝐇𝐈’ TRAILER TRENDING #1 on YouTube ❤🔥
GRAND RELEASE WORLDWIDE ON APRIL 18th, 2025.#ASOVTrailer#ArjunSonOfVyjayanthi@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar… pic.twitter.com/vDqnK83Y00
— BA Raju’s Team (@baraju_SuperHit) April 13, 2025
Hebah patel | చేసింది 16 సినిమాలు.. హిట్ అయినవి రెండే.. సోషల్ మీడియాలో మాత్రం..