Arjun | తెలుగు, కన్నడతోపాటు పాన్ ఇండియా మూవీ లవర్స్‌కు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ అర్జున్ (Arjun). యాక్షన్ కింగ్ డైరెక్టర్ అని కూడా తెలిసిందే. చివరగా లోకేశ్ కనగరాజ్ లియోలో మెరిశాడు అర్జున్. సుమారు ఆరేండ్ల విరామం తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టాడు. అర్జున్ డైరెక్ట్ చేస్తున్న కొత్త సినిమా సీత పయనం (Seetha Payanam). ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ లోగో ఆవిష్కరించాడు.
తాజా సమాచారం ప్రకారం మొదట ఈ సినిమాను కన్నడలో చిత్రీకరించనుండగా.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారట. అర్జున్ హోం ప్రొడక్షన్ బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుంటం విశేషం. ఈ ప్రాజెక్టులో ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ నిరంజన్ సుధింద్ర లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఇతర లీడ్ యాక్టర్లు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. పాపులర్ టెక్నీషియన్లు ఈ సినిమాలో భాగం కాబోతున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే 2022లో విశ్వక్ సేన్ హీరోగా ఐశ్వర్యా అర్జున్, జగపతి బాబు కాంబోలో అర్జున్ డైరెక్షన్లో ఓ సినిమా ప్రకటించాడని తెలిసిందే. కొన్ని రోజుల తర్వాత సినిమా రద్దైంది.
‘Action King’ #ArjunSarja‘ is back with his next directorial, #SeethaPayanam
A trilingual film in Telugu, Tamil & Kannada@akarjunofficial @SreeRaamFilms pic.twitter.com/RMiPpRJr27
— Rajesh Manne (@rajeshmanne1) October 16, 2024
Naga Chaitanya | అప్పటి నుంచే రేసు కారు జోలికిపోవడం లేదు : నాగచైతన్య
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్