ప్రముఖ దర్శకుడు శంకర్ స్వీయ నిర్మాణ సంస్థ యస్ పిక్చర్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్’. వసంతబాలన్ దర్శకుడు. అర్జున్ దాస్, విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను అగ్ర నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఈ నెల 21న విడుదలకానుంది. తెలుగులో ఎన్.ఆర్.డి.ఎస్ సంస్థ విడుదల చేస్తున్నది.
‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. ఓ జంట ప్రయాణంలో చోటు చేసుకున్న సంఘటనలేమిటన్నది ఆద్యంతం ఆసక్తిని పంచుతుంది. నాలుగు పాటలుంటాయి. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది’ అని దర్శకుడు చెప్పారు. వనితా విజయ్‌కుమార్, సురేష్ చక్రవర్తి తదితరులు ముఖ్యపాత్రల్ని పోషించారు.