1980లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున్ చక్రవర్తి – జర్నీ ఆఫ్ యాస్ అన్సంగ్ ఛాంపియన్’. విజయరామరాజు, సిజా రోజ్ ప్రధాన పాత్రధారులు. విక్రాంత్ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
‘1980లో భారత క్రికెట్‌పై కపిల్ దేవ్ ప్రభావం ఏ స్థాయిలో ఉండేదో అర్జున్ చక్రవర్తి ప్రభావం అప్పటి భారత కబడ్డీపై అంతగా ఉండేది’ అంటూ ఫస్ట్‌లుక్‌లో రాసిన అక్షరాలు సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లడం ఖాయమని, క్రీడాకారుడి పాత్ర కావడంచేత భారీ కసరత్తులతో తన శరీరాన్ని విజయరామరాజు ధృఢంగా మలుచుకున్నాడని, ‘అర్జున్చక్రవర్తి’ ఓ స్పూర్తిదాయక ప్రయాణమని, సాంకేతికంగా కూడా అద్భుతంగా ఉంటుందని నిర్మాత చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుందని దర్శకుడు తెలిపారు.