Ar Rahman | మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల తెగ వార్తలలో నిలుస్తున్నాడు. భార్యతో విడాకులు, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక ఇలా పలు విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా ఉన్న రెహమాన్ గత 30 సంవత్సరాలుగా అనేక అవార్డులు అందుకున్నారు. ఆస్కార్ అవార్డ్ కూడా సాధించిన ఘనత ఆయనది. తాను రూపొందిన ప్రతి పాట ఇప్పటికీ కూడా ఎంతో వినసొంపుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఏఆర్ రెహమాన్ ఇబ్బందుల్లో పడ్డాడు. కాపీరైట్ ఉల్లంఘన వివాదంలో రెహమాన్ చిక్కుకోవడం సంచలనంగా మారింది. 2022లో మణిరత్నం దర్శకత్వంలో విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించగా, 2023లో పొన్నియిన్ సెల్వన్ రెండవ భాగం విడుదలైంది.
ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన వీర రాజ వీర పాట మంచి ఆదరణ పొందింది. ఈ పాట కాపీరైట్‌కు సంబంధించి కోర్టులో దాఖలైన కేసులో ఏఆర్ రెహమాన్ ₹2 కోట్లు చెల్లించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. గాయకుడు వాసిఫుద్దీన్ ఠాగూర్ తన తాత, తండ్రి రచించిన శివ స్తుతి సంగీతాన్ని కాపీ కొట్టారని కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా, ఇప్పుడు కోర్టు రెండు లక్షలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ విషయం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. కాగా, కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, రవి మోహన్, కార్తి, త్రిష, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత తదితరులు నటించారు.
ప్రస్తుతం రెహమాన్ తన భార్యతో దూరంగా ఉంటున్నాడు. కాని బంధాన్ని అలాగే కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా కర్మ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ… ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వల్ల తిరిగి అదే తమకు రివర్స్ అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ తల్లి, చెల్లి, భార్య ఉంటారని, ఒకరిపై విమర్శలు చేేసేముందు ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. నేను వేరే వారి కుటుంబం గురించి చెబితే, వేరొకరు నా గురించి, నా కుటుంబం గురించి మాట్లాడుతారు అని రెహమాన్ చెప్పుకొచ్చాడు.