‘అమరన్’ చిత్రంతో గత ఏడాది భారీ విజయాన్ని అందుకున్నారు తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి ‘మదరాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నది. రుక్మిణి వసంత్ కథానాయిక. సోమవారం శివకార్తీకేయన్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌తో పాటు యాక్షన్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో శివకార్తీకేయన్ పూర్తి యాక్షన్ మోడ్‌లో కనిపించారు. విజువల్స్ ఆకట్టుకున్నాయి. అనిరుధ్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. విభిన్నమైన కథతో యాక్షన్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, శివకార్తికేయన్ పాత్ర కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.