AR Murugadoss | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు ఏఆర్ మురుగదాస్. గజినీ, స్టాలిన్, తుపాకి, కత్తి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేర్ చేసిన ఈ స్టార్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో సికిందర్ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు కోలీవుడ్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) SK23 ప్రాజెక్టును కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.
SKxARMగా వస్తోన్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ స్టార్ డైరెక్టర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. స్పెషల్ వీడియో విడుదల చేసింది శివకార్తికేయన్ టీం. షూటింగ్ స్పాట్లో తీసిన విజువల్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మరోవైపు తమ అభిమాన దర్శకుడికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు ఫాలోవర్లు, అభిమానులు, మూవీ లవర్స్.
SK23లో కన్నడ భామ రుక్మిణి వసంత ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. పాపులర్ మాలీవుడ్ యాక్టర్, అయ్యప్పనుమ్ కొషియుమ్ ఫేం బిజూమీనన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2025 పొంగళ్ కానుకగా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టైలిష్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శివకార్తికేయన్ దీంతోపాటు రాజ్‌కుమార్ పెరియస్వామి డైరెక్షన్లో ఎస్కే 21గా తెరకెక్కుతున్న అమరన్‌లో కూడా నటిస్తున్నాడు.
Team #SKxARM‘s special video on the birthday of its director @ARMurugadoss #SivaKarthiKeyan @Siva_Kartikeyan pic.twitter.com/dHUIESJ1J4
— BA Raju’s Team (@baraju_SuperHit) September 25, 2024
Sharwa 37 | కేరళలో శర్వానంద్ టీం.. శర్వా 37 షూట్‌పై కొత్త అప్డేట్
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!