టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ గతంలో స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తో తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. అయితే పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు అటకెక్కింది. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ ఇదే వార్త తెరపైకి వచ్చింది. మురుగదాస్ ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్‌తో సినిమా చేస్తున్నాడని, ఈ మేరకు కొన్ని రోజుల నుంచి చర్చలు కూడా జరుగుతున్నాయని లేటెస్ట్ టాక్.
రామ్ ను సంప్రదించిన మురుగదాస్ గతంలో బన్నీకి వినిపించిన కథనే వినిపించాడట. అయితే రామ్ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. రజినీకాంత్ 2020లో దర్బార్ సినిమా చేశాడు మురుగదాస్. ఈ చిత్రం తర్వాత ఏ మూవీ చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తునున్నారు. మరి రానున్న కాలంలో మురుగదాస్-రామ్ కాంబో సెట్ అవుతుందా..? లేదా చూడాలి.
ఇవి కూడా చదవండి..
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!