Ap brand ambassador | టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా శక్తీకరణ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఏపీ ప్రభుత్వంకి సంబంధించిన సోషల్ మీడియా ఫ్యాక్ట్ చెక్ వింగ్ స్పందిస్తూ ఆ వార్తలు ఫేక్ అని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు ఉంటాయి. అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి చెందిన ఫ్యాక్ట్ చెక్ వింగ్ సోషల్ మీడియా వేదికగా రాసుకోచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారమైన చర్యలు ఉంటాయి.… pic.twitter.com/96uI4Xb0Zr
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) March 2, 2025