Pawan Kalyan | ఇటీవలే రాజమండ్రిలో రాంచరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన కాకినాడ-రాజమండ్రి మధ్య ఎడిబి రోడ్డు ప్రమాద స్థలిని జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పరిశీలించారు.
రాజమండ్రి నుంచి రంగంపేట ఏడీబీ రోడ్డు మీదుగా పిఠాపురం వెళ్తున్న పవన్ కల్యాణ్ ప్రమాద స్థలం దగ్గర అధికారులతో కలిసి ఆగారు. రోడ్డు మరమ్మతు పనుల గురించి ఆరా తీశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే.
ఈవెంట్ అనంతరం తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) మృతి చెందగా.. వారికి జనసేన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరపున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించారు. మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా మృతుల కుటుంబసభ్యులకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్
Sai kumar | మీ ప్రేమకు సదా రుణపడి ఉంటా.. 50 ఏండ్ల సినీ ప్రస్థానంపై సాయికుమార్