Anushka Shetty | అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది బెంగళూరు చిన్నది అనుష్కా శెట్టి (Anushka Shetty). ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. బాహుబలి ప్రాంఛైజీలో దేవసేనగా నటించి వరల్డ్‌వైడ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సిల్వర్ స్క్రీన్‌పైకి కనిపించక చాలా కాలమే అవుతుంది. అయితే ఈ భామ లాంగ్ గ్యాప్ తర్వాత చాలా హ్యాపీ మూడ్‌లో కనిపిస్తుంది. ఇంతకీ స్పెషల్ ఏంటనే కదా మీ డౌటు. అనుష్క ట్విట్టర్ (Anushka Twitter) ఫాలోవర్ల సంఖ్య 1 మిలియన్‌కు చేరుకుంది. 2020లో ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చింది స్వీటీ. రెండున్నర సంవత్సరాల్లో ఈ మైల్స్టోన్ చేరుకుంది. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ లవ్ యూ.. ధన్యవాదాలు అని ఎమోజీలను పోస్ట్ చేసింది అనుష్క.
నిశ్శబ్దం సినిమా తర్వాత ప్రస్తుతం మిస్ Shetty మిస్టర్ Polishetty సినిమాలో నటిస్తోంది అనుష్క. ఈ సమ్మర్లోనే థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. మహేశ్ బాబు పీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
అనుష్కా శెట్టి హ్యాపీమూడ్ ..
1M 💙 🙏 pic.twitter.com/fmCmTsJFjG
— Anushka Shetty (@MsAnushkaShetty) April 23, 2023
నోనోనో లిరికల్ సాంగ్..
Read Also :
Captain Miller | ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో ఆర్ఆర్ఆర్ యాక్టర్
Sarath Babu | శరత్‌బాబు ఆరోగ్యంపై తాజా అప్డేట్
Vishal 34 | విశాల్ 34 లాంఛ్.. ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్