Ghaati | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న దక్షిణాది భామల్లో టాప్‌లో ఉంటుంది అనుష్కా శెట్టి (Anushka Shetty). ఈ భామ మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఘాటి (Ghaati) సినిమాలో నటిస్తుందని తెలిసిందే. సోషల్ డ్రామా నేపథ్యంలో వస్తుండగా.. ఇప్పటికే లాంచ్ చేసిన ప్రీ లుక్‌తోపాటు మరో పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
షూటింగ్ పూర్తయ్యే దశలో ఉంది. మైనర్ ప్యాచ్ వర్క్‌తో చిత్రీకరణ పూర్తయినట్టేని టాలీవుడ్ సర్కిల్ సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే 2025 మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. మరి దీనిపై క్రిష్ టీం రాబోయే రోజుల్లో ఏదైనా అధికారిక ప్రకటన చేస్తారా..? అనేది చూడాలి.
నేరస్థురాలిగా మారిన బాధితురాలు ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుందనే నేపథ్యంలో ఘాటి ఉండబోతుందట. ఇప్పటికే జనాలంతా కొండ ప్రాంతం మధ్యలోని దారి వెంట మూటలు మోసుకొని వెళ్తున్న లుక్ ఒకటి సోషల్ మీడియాలో సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది. అనుష్క ప్రస్తుతం Kathanar – The Wild Sorcerer సినిమాలో లీడ్ రోల్లో నటిస్తోంది. రొజిన్ థామస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Ghaati ప్రీ లుక్..
Anushka Shetty’s Film With Krish Is Titled ‘Ghaati’#Ghaati #KrishJagarlamudi #AnushkaShetty #FirstFramesEntertainments #AmazonPrimeVideo #Vamsi #RajivReddy #ChintakindiSrinivasRao #HariHaraVeeraMallu #BurraSaiMadhav pic.twitter.com/FQuWWf9Jh2
— SAI KRISHNA (@SAIKRIS40918887) March 20, 2024
Bloody Beggar | బ్లడీ బెగ్గర్ ఓటీటీలోకి వచ్చేశాడు.. కవిన్ సందడి చేసే పాపులర్ ప్లాట్‌ఫాం ఇదే
THE PARADISE | నానితో కలెక్షన్ కింగ్ ఫైట్.. శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ క్రేజీ న్యూస్..!
Jailer 2 | తలైవా బర్త్ డే స్పెషల్.. జైలర్ 2 షూటింగ్ షురూ అయ్యే టైం ఫిక్స్