Ghaati | టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా స్థాయి ఇమేజ్ సంపాదించుకున్న భామల్లో టాప్‌లో ఉంటుంది అనుష్కా శెట్టి (Anushka Shetty). చాలా రోజుల తర్వాత స్వీటీ కాంపౌండ్ నుంచి వస్తోన్న ప్రాజెక్ట్ ఘాటి (Ghaati). తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ మూవీ విడుదల తేదీని నేడు ప్రకటించబోతున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది.
నేరస్థురాలిగా మారిన ఓ బాధితురాలు ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుందనే నేపథ్యంలో ఘాటి ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇటీవలే ఈ మూవీ నుంచి జనాలంతా కొండ ప్రాంతం మధ్యలోని దారి వెంట మూటలు మోసుకొని వెళ్తున్న లుక్‌తోపాటు గ్లింప్స్ సోషల్ మీడియాలో సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది.
Vidudhala Part 2 | విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 కోసం వెట్రిమారన్ క్రియేట్ చేసిన ఊరిని చూశారా..?
Vishnu Manchu | హాలీవుడ్ స్టార్ విల్స్మిత్తో మంచు విష్ణు.. క్రేజీ వార్త వివరాలివే..!