ఈ ఏడాది ప్రారంభంలో అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విరుష్క జోడి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నామని, త్వరలోనే పాప గురించి చెబుతామని అన్నారు. కొద్ది రోజుల తర్వాత తన కూతురికి వామిక అనే పేరు పెట్టినట్టు తెలియజేసిన విరుష్క దంపతులు పాప ఫేస్ ఎక్కడా రివీల్ కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
వామిక అంటే దుర్గా మాత. ఈ చిన్నారి పుట్టి ఆరు నెలలు అయిన సందర్భంగా అనుష్క శర్మ తన సోషల్ మీడియాలో చిన్నారితో సరదాగా గడుపుతున్న సందర్భాలకి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. ఏ ఫొటోలోను వామిక ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ఈ ఫొటోలకు అనుష్క.. నా చిన్న పాప ఒక్క నవ్వుతో మా ప్రపంచం మొత్తాన్ని మార్చేసింది.. నువ్ మమ్మల్ని అలా చూస్తుంటే మా ఈ జీవితాలను ఇలా హాయిగా గడిపేయోచ్చు.. నువ్ పుట్టి ఆరు నెలలు అవుతోంది అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. అయితే ఒక్కసారి వామిక ఫేస్ రివీల్ చేయండని నెటిజన్స్ కోరుతున్నారు.