కొత్తదనంతో కూడిన సినిమాలు చేసే యాక్టర్లలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు టాలీవుడ్ హీరో నిఖిల్ (Nikhil Siddharth). ఈ హీరో చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో చేస్తున్న చిత్రం కార్తికేయ 2. మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. అనుపమ ఈ సినిమా మలయాళ వెర్షన్‌కు డబ్బింగ్ పూర్తి చేసింది.
డబ్బింగ్ స్టూడియోలో తీసిన స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..ఈ విషయాన్ని అందరితో పంచుకుంది ఈ మల్లూ బ్యూటీ. థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్‌ఖేర్ కీ రోల్ చేస్తున్నారు. కార్తికేయ 2లో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్య మీనన్, హర్ష చెముడు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందు మొండేటి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం..కాగా కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
Read Also : Jr NTR | ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్ షురూ.. దేనికోసమంటే..?
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!