నాకు నటన రాదన్నారు
జన్మతహా మలయాళీ అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ఆమె.. తన తాజా మలయాళ సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ ప్రమోషన్స్‌లో మాట్లాడింది.
జన్మతహా మలయాళీ అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ఆమె.. తన తాజా మలయాళ సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ ప్రమోషన్స్‌లో మాట్లాడింది. ‘తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడానికీ, మాతృభాష మలయాళంలో తక్కువ సినిమాలు చేయడానికి కారణం లేకపోలేదు. మలయాళం ‘ప్రేమమ్’ సినిమాతో నా కెరీర్ మొదలైంది. తొలినాళ్లలో నన్ను చాలామంది ట్రోల్ చేశారు. నాకు నటనే రాదన్నారు.
ఆ విమర్శలు నాలో కసిని పెంచాయ్. జనానికి నచ్చే సినిమాలే చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అలాంటి సమయంలో తెలుగులో ఆఫర్లొచ్చాయి. అవి సక్సెస్‌లు కూడా అయ్యాయి. దాంతో అనుకోకుండానే తెలుగులో ఎక్కువ సినిమాలు చేశా. అన్ని ట్రోల్స్ వచ్చినా.. నాపై నమ్మకంతో ఇన్నాళ్లకు మళ్లీ ‘జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ వంటి గొప్ప సినిమాకు నన్ను ఎంపిక చేశారు దర్శకుడు ప్రవీణ్ నారాయణ్.
నన్ను విమర్శించినవారందరికీ ఈ సినిమా సమాధానమిస్తుంది. ఈ సందర్భంగా నాకు మద్దతు ఇచ్చినవారితోపాటు, నన్ను ద్వేషించినవారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా.’ అని పేర్కొన్నది అనుపమ పరమేశ్వరన్. ఈ నెల 27న అనుమప ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా కేరళలో విడుదల కానుంది. సురేశ్ గోపీ లాయర్‌గా నటించిన ఈ చిత్రంలో జానకిగా అనుపమ కనిపించనుంది. ‘సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది..’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

