ఒక మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ‘అనుకోని ప్రయాణం’ నిరూపించిందన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో నరసింహరాజుతో కలిసి నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకుడు. ఆదివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘మానవ విలువలు తగ్గిపోతున్న ఈ కాలంలో వాటిని గుర్తుచేసేలా ఈ సినిమాను తెరకెక్కించారు’ అన్నారు. సీరియస్ కథను ఎంటర్టైనింగ్గా చెప్పామని, అన్ని వర్గాల వారు సినిమాకు కనెక్ట్ అవుతున్నారని దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల తెలిపారు. అరుదుగా వచ్చే ఈ తరహా కథల్ని ప్రేక్షకులు ఆదరించాలని నిర్మాత డా॥ జగన్మోహన్ డీవై కోరారు.