మలయాళ హీరో ఆంటోనీ వర్గీస్ కథానాయకుడిగా రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కటాలన్’. పాల్ జార్జ్ దర్శకత్వంలో క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు ఇప్పటికే మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు.
ఏనుగుల వేట అనేది ఈ సినిమాలో కీలకమని. మాస్ ప్రేక్షకులు పండుగ చేసుకునేలా ఇందులో ఆంటోనీ వర్గీస్ క్యారెక్టర్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పానిండియా స్థాయిలో మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రెనదివ్, సంగీతం: బి.అజనీష్ లోక్నాథ్.