టాలీవుడ్ స్టార్ యాక్టార్ నాని (Nani) రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ అంటే సుందరానికి (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంతో నజ్రియా నజీమ్ (Nazriya Nazim) తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతుంది. బుధవారం రిలీజైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. నాని మళ్లీ చాలా రోజుల తర్వాత తనలోని ఫన్ యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడని టీజర్‌తో చెప్పేశాడు దర్శకుడు.
ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లో 11 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి..నంబర్ 1 పొజిషన్ లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటివరకు వచ్చిన టాలీవుడ్ మోస్ట్ వ్యూస్ సాధించిన (విడుదలైన 24 గంటల్లో) టాప్ 10 టీజర్లలో అంటే సుందరానికి 8వ స్థానంలో నిలువడం విశేషం. వ్యూయర్ షిప్ విషయంలో ప్రభాస్, రాంచరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు జాబితాలో నాని కూడా చేరిపోయాడు.
నాని బ్రాహ్మణుడి గెటప్‌లో కనిపిస్తుండటం, అతనికి జోడీగా నటిస్తున్న నజ్రియా క్రిస్టియన్ కావడం, ఇద్దరి మధ్య లవ్ ట్రాక్‌తో వచ్చే చిక్కులు, కామెడీతోపాటు డైలాగ్స్, ఫన్నీ సీన్లు ఇలా అన్నీ కలగలిపి టీజర్ క్రేజ్‌ను పెంచేశాయి. వివేక్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్. నదియా, నరేశ్, హర్షవర్దన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది.
అంటే సుందరానికి టీజర్..