తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ టాలీవుడ్ భామ కొంతకాలంగా హిందీ సినిమాలపైనే ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన డాక్టర్ జీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. థ్యాంక్ గాడ్ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ఈ బ్యూటీ తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఊహించే ఉంటారు. రకుల్ భాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నాని (Jackky Bhagnani). సాంటా తన జీవితంలో ఉత్తమ బహుమతి అందించాడని జాకీ భగ్నానీనుద్దేశించి క్యాప్షన్ ఇచ్చింది. ‘నాకు ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన జీవనాన్ని అందించిన నా ప్రియుడు జాకీ భగ్నానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను .. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉండండి..’ అంటూ క్యాప్షన్ పోస్ట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీలో ఛత్రివాలి, మేరీ పత్నీ కా రీమేక్, తమిళంలో అయలాన్, ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తోంది. వీటితోపాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 31 October Ladies Night సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఇండియన్ 2లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోంది.
స్టైలిష్ సెల్ఫీతో రకుల్ శుభాకాంక్షలు..
Read Also : Rashmika Mandanna | సిద్దార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా స్కూటర్ రైడ్.. ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Sushant Singh Rajput | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యే : రూప్‌కుమార్ షా
Read Also : Hari Hara Veera Mallu | హరిహరవీరమల్లుకు ఆర్ఆర్ఆర్ క్రేజ్ కలిసొచ్చేనా..?