ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 12, 2020 , 13:17:49

వివేక్‌ ఒబెరాయ్‌ పేరు సూచించిన బాలకృష్ణ..!

వివేక్‌ ఒబెరాయ్‌ పేరు సూచించిన బాలకృష్ణ..!

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో బీబీ3 (వర్కింగ్‌ టైటిల్‌)మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. లాక్‌డౌన్‌కు ముందే ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారనే దానిపై పలు వార్తలు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సంజయ్‌దత్‌ను విలన్‌గా తీసుకోనున్నట్టు వార్తలు రాగా..కరోనా లాంటి సమయంలో ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇవ్వలేమని భావించిన చిత్రయూనిట్‌ ఇపుడు మరో నటుడిని అన్వేషించే పనిలో పడిందట. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్‌ స్టార్‌ వివేక్‌ ఒబెరాయ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

వివేక్‌ ఒబెరాయ్‌ పేరును బాలకృష్ణనే బోయపాటికి సూచించాడని ఇన్‌సైడ్‌ టాక్‌. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవమనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. వివేక్‌ ఒబెరాయ్‌ ఇప్పటికే బోయపాటి శ్రీను-రాంచరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో విలన్‌గా నటించాడు. బీబీ3 చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo