Anni manchi Shakunamule Movie | టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ కెరీర్ ఒక అడుగు ముందుకు పడుతుంటే నాలుగు అడుగులు వెనక్కి పడిపోతున్నాయి. ‘గోల్కొండ హై స్కూల్’తో బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంతోష్ నాలుగేళ్లకు ‘తాను నేను’ సినిమాతో హీరో అవతారమెత్తాడు. తొలి సినిమానే డిజాస్టర్ ఫలితాన్నిచ్చింది. దాంతో మూడేళ్లు గ్యాప్ తీసుకుని ‘పేపర్ బాయ్’ వంటి న్యూఏజ్ లవ్‌స్టోరీతో వచ్చాడు. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్ లభించిన కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయింది. దాంతో మరో మూడేళ్లు గ్యాప్ తీసుకుని ‘ఏక్ మినీ కథ’ వంటి బోల్డ్ కంటెంట్‌తో వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందాడు. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమాతో సంతోష్ శోభన్ పేరు కాస్తో కూస్తో జనాలకు రిజిస్టర్ అయింది.
కట్ చేస్తే మళ్లీ బ్యాక్ టు బ్యాక్ నాలుగు డిజాస్టర్లు. దాంతో సంతోష్ మార్కెట్ అమాంతం పడిపోయింది. రొటీన్ కథలతో వస్తూ జనాలకు కూడా బోర్ కొట్టేశాడు. ప్రస్తుతం సంతోష్ ఆశలన్ని ‘అన్ని మంచి శకునములే’ సినిమాపైనే ఉన్నాయి. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు సినిమాపై మంచి బజ్నే క్రియేట్ చేశాయి. పైగా వైజయంతీ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో జానాల్లో కాస్త పాజిటీవ్ హైపే ఉంది. రొమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మే 18న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్ను ప్రకటించింది. మెరిసే మబ్బుల్లో అంటూ సాగే సమ్మర్ స్పెషల్ మెలోడి సాంగ్‌ను ఏప్రిల్ 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశారు. బలాదూర్‌గా తిరిగే హీరో, ఇంటి బాధ్యతను మీదేసుకున్న హీరోయిన్, వేరు వేరు స్వభావాలున్న వీరిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సంతోష్‌కు జోడీగా మాళవికా నాయర్ నటిస్తుంది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
Get ready for summer vacation, Meet Rishi & Arya in Italy on this Thursday 🍃💚
Our summer song #MeriseMabbullo on April 20th.https://t.co/18MtCTi77P#AnniManchiSakunamule @santoshsoban #MalvikaNair #NandiniReddy @MickeyJMeyer @SwapnaCinema @VyjayanthiFilms@SonyMusicSouth pic.twitter.com/ncJd2ibwzZ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 17, 2023